Saturday, September 15, 2007

జీవ వైవిధ్యం కోల్పోతున్నాం

మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. వనరులను దుర్వినియొగం చేస్తున్నాడు. మిథ్యా నాగరీకరణ (Psudo civilization) మరియు పట్టణీకరణ లతో మనిషి, మనిషికై ప్రకృతితి విధించిన నియమాలను ఉల్లంఘించి సహజ జీవన విధానానికి దూరమై కృత్రిమత్వానికి లోనవుతున్నాడు.మన పితృతరం చిన్నప్పుదు ప్రకృతి ఒడిలో అనుభవించిన అనేక అనందాల్లో కొన్ని మచ్చుకు మాత్రమే మిగిలాయి. తూనిగలు, సీతాకోకచిలుకలు, పాటలకే పరిమితమై, మన పిల్లల తరానికి చూపించలంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసి చూపించే దుస్థితిలో ఉన్నాం ఒకప్పుడు ఇళ్ళగోడ రంధ్రాల్లొ కాపురం పెట్టే ఊర పిచ్చుకలు మన చుట్టు భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదు. నగరం లోని కొన్ని ప్రాంతాల్లో కాకులు కుడా కనిపించటంలేదు. జీవులు కేవలం ఈ భూగ్రహం పై మాత్రమే ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇలానే ఇంకా కొన్నాళ్ళు కొనసాగితే..... మనం డైనోసార్లగురించి ఎలా చెప్పుకుంటామో వీటన్నింటి గూర్చి అలాగే చెప్పుకోవాల్సి వస్తుంది.

1 comment:

రాధిక said...

nijamea.rakshimcukoavaali.